భావోద్వేకానికి గురై కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే వరద
- PRASANNA ANDHRA

- Jan 18, 2024
- 1 min read
భావోద్వేకానికి గురై కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎలక్షన్ కోడ్ అమలులో లేదు, పోలీసులకు తనిఖీలు చేసే ఆదేశాలు ఎవరిచ్చారో తెలపాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు? అధికారులు, ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై, మాజీ ఎమ్మెల్యే వరద ఫైర్ అయ్యారు. అధికారుల అనధికార దాడులకు వ్యాపారులు వ్యాపారాలు చేసే పరిస్థితిలో లేరని, పట్టణంలో ప్రతిరోజు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకే పోలీసులు తనిఖీలు చేపట్టారని, ప్రజల కష్టనష్టాలు ప్రజా ప్రతినిధులకు పట్టవా అని ప్రశ్నిస్తూ? ఒకానొక దశలో భావోద్వేకానికి గురై దగ్ధస్వరంతో కన్నీటి పర్యంతమయ్యారు. దాడులు వారే చేయిస్తారు మరలా నిరసనలు కూడా వారే తెలుపుతారు అంటూ ఎమ్మెల్యే రాచమల్లు పై ఆరోపణలు గుప్పించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నిరసన చేయటం హాస్యాస్పదమని ఆయన అన్నారు. సమావేశంలో పలువురు వ్యాపార, వాణిజ్య, వర్తకులు పాల్గొన్నారు.











Comments