మాజీ ఎమ్మెల్యే వరద హౌస్ అరెస్ట్
- PRASANNA ANDHRA

- Sep 15, 2023
- 1 min read
మాజీ ఎమ్మెల్యే వరద హౌస్ అరెస్ట్


కడప జిల్లా, ప్రొద్దుటూరు
మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పట్టణంలోని శివాలయం కూడలి వద్ద గల ధర్నా చౌక్ లో జరుగుతున్న నేపథ్యంలో, గురువారం కూడా అక్కడ వరద ఆయన అనుచరులు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన, రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం విదితమే. గురువారం రెండు రోజులకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు, గురువారం రాత్రి ధర్నా చౌక్ లో వరద వర్గం ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని తొలగించారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున కామనూరు లోని వరద ఇంటికి పోలీసులు చేరుకుని ఆయనను రిలే నిరాహార దీక్షకు కూర్చోనివ్వకుండా అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న వరద అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొన్నారు.










Comments