టిడిపి తో పొత్తు వద్దని మోకరిల్లెందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి - మాజీ ఎమ్మెల్యే వరద
- PRASANNA ANDHRA

- Feb 10, 2024
- 1 min read
టిడిపి తో పొత్తు వద్దని మోకరిల్లెందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి - మాజీ ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ మెట్రో వంటి పనులు గుర్తుకు వస్తాయా అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత నంద్యాల వరదరాజుల రెడ్డి విమర్శించారు .అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలలో కేంద్రం వద్దకు వెళ్లి రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించలేదని, కేవలం తన కేసులు విషయమై ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనపై ఉన్న కేసులకు సంబంధించి ఒక వాయిదా కూడా హాజరు అవ్వకుండా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారం చేపట్టబోతుందో ఆ పార్టీలతోనే కేంద్రం పొత్తులకు పెట్టుకుంటుందని వరదరాజుల రెడ్డి తెలిపారు . టిడిపి తో కేంద్రం పొత్తు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో టిడిపి తో పొత్తువద్దని మోకరిల్లిందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని అన్నారు..
To watch this video take on this link :














Comments