మాజీ ఎమ్మెల్యే వరదకు స్వల్ప అస్వస్థత
- PRASANNA ANDHRA

- Sep 11, 2023
- 1 min read
మాజీ ఎమ్మెల్యే వరదకు స్వల్ప అస్వస్థత

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో, టిడిపి నాయకులు బంద్ కు పిలుపునివ్వగా ప్రొద్దుటూరులోని టిడిపి శ్రేణులు బంద్ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టిడిపి నాయకులు నంద్యాల వరదరాజుల రెడ్డి సోమవారం ఉదయం ఆయన అనుచరవర్గంతో శివాలయం కూడలి వద్ద బంద్ లో పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ నిరసన తెలుపుతున్న సందర్భంలో వరదరాజుల రెడ్డికి బీపీ తగ్గటంతో స్వల్ప అస్వస్థకు గురయ్యారు హుటాహుటిన ఆయనను గాంధీ రోడ్డులోని కెవిఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది.












Comments