బాబు అరెస్టుకు నిరసనగా దీక్ష
- PRASANNA ANDHRA

- Sep 10, 2023
- 1 min read
బాబు అరెస్టుకు నిరసనగా దీక్ష

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. మొదట టిడిపి కార్యాలయం నుంచి శివాలయం సెంటర్ వరకు రాలీగా చేరుకొని శివాలయం సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడును రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బందులు గురిచేస్తుందని, ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ నంద్యాల వరదరాజుల రెడ్డి విమర్శించారు.













Comments