వరద ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహారదీక్ష
- PRASANNA ANDHRA

- Sep 14, 2023
- 1 min read
వరద ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహారదీక్ష


కడప జిల్లా ప్రొద్దుటూరు
మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గురువారం ఉదయం ప్రొద్దుటూరులోని ధర్నా చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకులు నంద్యాల వరదరాజులు రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం కక్ష ధోరణితో వ్యవహరించి బాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని, చంద్రబాబు బెయిల్ పై బయటికి వచ్చేంతవరకు తాము రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ చైర్మన్ ఆసం రఘురామి రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బాలుడు, తలారి పుల్లయ్య, ఎర్రన్న, రామచంద్రారెడ్డి, వుండేల నారాయణరెడ్డి, నాయకులు ఘంటసాల వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, వరద అభిమానులు పాల్గొన్నారు.











Comments