మాజీ మంత్రి పుష్పశ్రీవాణికి పితృ వియోగం
- PRASANNA ANDHRA

- Aug 4, 2022
- 1 min read
మాజీ మంత్రి పుష్పశ్రీవాణికి పితృ వియోగం
మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తండ్రి పాముల నారాయణమూర్తి (62) బుధవారం రాత్రి గుండెపోటు తో కన్నుమూశారు. ఆయన ఉద్యోగం నిమిత్తం విజయనగరం జిల్లా నుంచి ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీకి వచ్చి కమాటీ, టీచర్‌గా పనిచేస్తూ బుట్టయగూడెం మండలం దొరమామిడిలో స్థిరపడ్డారు. నారాయణమూర్తికి ముగ్గురు కుమార్తెలు తులసీ, పుష్పశ్రీవాణి, సుృజన, ఒక కుమారుడు పృధ్వీరాజ్ ఉన్నారు.

పెద్ద కుమార్తె తులసీ జర్మనీలో ఉంటుండగా రెండవ కుమార్తె మాజీ మంత్రి పుష్పశ్రీవాణి. మూడవ కుమార్తె సుృజన విజయనగరం జిల్లాలో ఉంటున్నారు. కుమారుడు టీచర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో ఉంటున్నారు. జర్మనీలో ఉంటున్న తులసి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆమెను తీసుకువచ్చేందుకు జంగారెడ్డిగూడెం వచ్చిన ఆయనకు గుండెపోటు రాగా, అక్కడే ప్రవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. చివరకు పెద్దకుమార్తెను చూడకుండానే ఆయన కన్నుమూశారు.








Comments