top of page

ఈ.ఎస్.ఐ ఆసుపత్రి పనులు పరిశీలించిన బీజేపీ నాయకులు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 5, 2022
  • 1 min read

ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, ములగడ మండలం : మల్కాపురం 40 వ వార్డు గాంధీ గ్రామంలో ఉన్న కార్మిక ప్రభుత్వ భీమా ఆసుపత్రిని (E S I Hospital) మరమ్మత్తుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం 24 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, ఆసుపత్రి పనులు పర్యవేక్షణ నిమిత్తం ఈరోజు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు విశాఖ పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జి ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో, ఆసుపత్రి ఇన్చార్జ్ నవీన్ ని కలిసి, ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ గదులు, పేషెంట్ల గదులు మరియు టాయ్ లెట్లు గదులను సందర్శించి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ములకలపల్లి ప్రకాష్ మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంత ఏరియా 7 వార్డులలో ఉన్న కార్మికుల కుటుంబాలు అందరికీ ఈ ఆసుపత్రిని త్వరలో ప్రారంభించి, అందుబాటులోకి రానున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ములకలపల్లి ఈశ్వరవు, మల్కాపురం మండల అధ్యక్షుడు యలబిల్లి వెంకట్రావు, మెరుగు నూకరాజు,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page