top of page

మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి - పోతుకుంట రమేష్ నాయుడు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 15, 2023
  • 1 min read

మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి - పోతుకుంట రమేష్ నాయుడు

సుష్మా స్వరాజ్ సేవారత్న పురస్కారాల ప్రధానోత్సవం

రాజంపేట, ప్రసన్న ఆంధ్ర


మన్నూరు ప్రాథమిక వైద్యశాల నందు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బాలరాజు సుభద్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో సేవ చేసినటువంటి డాక్టర్ ఎస్.రిహన బాను, నర్సులు పి.నీరజ, జయకుమరి లకు సుష్మా స్వరాజ్ పేరిట సుష్మా స్వరాజ్ సేవా రత్న పురస్కారాలు ప్రధానం చేసి వారిని ఘనంగా సత్కరించడం జరిగింది.

ree

ఈ సందర్భంగా రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ మహిళలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని., పురుషులకు ఏ విధంగా తీసిపోని విధంగా నేడు సమాజంలో పనిచేస్తున్నారని అన్నారు. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో ఆ ప్రాంతం ఎంతో సుభిక్షంగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బిజెపి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా శుభపరిణామమని వారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బాలరాజు సుభద్ర, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టుపోగుల ఆదినారాయణ, మహిళా మోర్చా నాయకురాలు రామలక్ష్ముమ్మ, రాజేశ్వరి, గంగాదేవి, లక్ష్మి దేవి, మస్తాని, డి.నాగమణి, పట్టణ ప్రధాన కార్యదర్శి జీ.కే నాగరాజు, నాయకులు టీ.హరిప్రసాద్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page