విద్యార్థి బలవన్మరణానికి కారణాలు???
- PRASANNA ANDHRA

- Sep 12, 2022
- 1 min read

అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం బోయనపల్లి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళశాలలో బిటెక్ ఈ.ఈ.ఈ బ్రాంచ్ నందు మూడవ సంవత్సరం అభ్యసిస్తున్న మారంరెడ్డి చిన్న రెడ్డయ్య తాను ఉంటున్న గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని ఈరోజు తెల్లవాురుజామున ఆత్మహత్య చేసు సంగతి పాఠకులకు విదితమే. కాగా చిన్న రెడ్డయ్య కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని ప్రేమించాడని, ప్రేమ విఫలం అవటం వలనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు చెప్పుకుంటున్నారు. అయితే చిన్న రెడయ్య ఇంజినీరింగ్ విద్యను అభ్యసించటం కష్టం అవటం చేత మనస్థాపానికి గురై, చదవలేక ఇబ్బంది పడుతూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పడ్డారని మరికొంది మంది విద్యార్థులు చెపినట్లు, విచారణలో తేలిందని మన్నురు పోలీసులు చెబుతున్నారు. మృతి చెందిన విద్యార్థి పెనగలురు మండలం పొందూరు గ్రామం విద్యార్థి మృతి పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








Comments