top of page

పవన్ తోనే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 9, 2023
  • 1 min read

పవన్ తోనే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు...

సమావేశం లో మాట్లాడుతున్న అతిగారి దినేష్

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం యువగర్జన సంఘీభావ దీక్షను నిర్వహించారు.రాజంపేట నియో జకవర్గ జనసేన పార్టీ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పొలిశెట్టి శ్రీనివాసులు శ్రీకాకుళం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన యువగర్జన దీక్షకు నిరసన సంఘీభావంగా జనసేన నాయకులు వీర మహిళలతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని యువతి యువకులు ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసలుగా వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారిని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నారని ఆయనకు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో టిడిపి తో కలిసి రాష్ట్రంలో అధి కారం చేపట్టి వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇస్తే యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య ,జనసేన నాయకులు భాస్కర్ పంతులు, కోలాటం హరి, నాగార్జున, ఓబులేష్, రామ శ్రీనివాస్, యెద్దల నరసింహా, మస్తాన్ రాయల్, రాము, రత్నం, పి,వెంకటయ్య , ఆచారి, చౌడయ్య, వెంకటేష్, గోపాల్ జనసేన వీర మహిళలు జడ్డ శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page