అట్టహాసంగా ఎలక్ట్రిషన్ డే వార్షికోత్సవ సంబరాలు
- EDITOR

- Jan 27, 2023
- 1 min read
అట్టహాసంగా ఎలక్ట్రిషన్ డే వార్షికోత్సవ సంబరాలు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
శుక్రవారం న్యూ ఆంధ్ర ఫంక్షన్ హాల్ నందు శ్రీ అన్నమయ్య ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగవ ఎలక్ట్రిషన్ డే వార్షికోత్సవ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. శ్రీ పవన్ ఎలక్ట్రికల్స్, నందిని ట్రేడర్స్, ఎస్.ఎల్.ఎస్ ఎలక్ట్రికల్స్, శ్రీ సాయి శ్రీనివాస ట్రేడర్స్,పద్మావతి ఎలక్ట్రికల్స్, ఎస్.ఎం ట్రేడర్స్ సహకారంతో వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక సంబరాలు అందరినీ అలరించాయి. అనంతరం సీనియర్ ఎలక్ట్రీషియన్లను, ఎలక్ట్రీషియన్ దుకాణదారులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కార్మిక అసిస్టెంట్ కమిషనర్ పి.పద్మావతి పాల్గొని గృహ విద్యుత్ కార్మికులను ఉద్దేశ్యించి ప్రసంగించారు. థామస్ అల్వా ఎడిసన్ 27 వ తేదీ, సం.1880 జనవరి లో బల్బును కనుగొన్నారని, ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రీషియన్ డే గా జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఎడిషన్ ఆవిష్కరణతో మానవ జీవితంలోకి వెలుగులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా ఉప కార్యదర్శి బి.నరసింహులు, శ్రీ అన్నమయ్య ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తరుణి కుమార్, అధ్యక్షులు కే.వి.కే.ఎస్ వర్మ, ఉపాధ్యక్షులు మహంకాలయ్య, ప్రధాన కార్యదర్శి సంజీవ నాయుడు, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, కోశాధికారి సురేష్ బాబు, నిర్వాహకులు నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








Comments