top of page

ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే

  • Writer: EDITOR
    EDITOR
  • May 1, 2023
  • 1 min read

ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే

ree
ree

రాజంపేట


శ్రీ అన్నమయ్య ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎలక్ట్రీషియన్ యూనియన్ నాయకులతో పాటు నందలూరు, పుల్లంపేట, పెనగలూరు ఎలక్ట్రీషియన్ యూనియన్ నాయకులు పాల్గొని కార్మిక దినోత్సవాన్ని పండుగలా జరుపుకున్నారు.

ree

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులు లేనిదే ఏ ఉత్పత్తి జరగదని అన్నారు. తినే తిండి నుంచి అంతరిక్షంలో రాకెట్ ప్రయోగం వరకు చెమటోడ్చే కార్మికుడి పాత్ర ఉంటుందని తెలిపారు. కార్మికులంతా ఐకమత్యంతో కలిసిమెలిసి హక్కుల సాధన కోసం ఐక్య పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page