నేడే వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల
- EDITOR

- Mar 16, 2024
- 1 min read

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది లోక్ సభ తో పాటు, ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సిఈసి. ఇందులో ఏపీ, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, త్వరలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే నేడు ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను, 25 లోక్ సభ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉంది.














Comments