రైతు సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వరద
- PRASANNA ANDHRA

- Oct 31, 2023
- 1 min read
రైతు సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని రైతుల గురించి ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం వర్షాలు పడక, ముఖ్యంగా రాయలసీమలోని రైతులు వర్షాలు లేక, కాలువలకు నీరు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించే మార్గం చూపడం లేదని మాజీ ఎమ్మెల్యే వరద అన్నారు. వెంటనే రాష్ట్రంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రొద్దుటూరులో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రొద్దుటూరు తాసిల్దార్ కు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ,రైతులు ,టిడిపి శ్రేణులు వినతిపత్రం సమర్పించారు.









Comments