ఏకో ఫ్రెండ్లీ గణనాథుల పంపిణీ - గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్
- PRASANNA ANDHRA

- Aug 30, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

గణేశ చతుర్థి పండుగ సందర్భంగా, గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, చైర్మన్ గంగిశెట్టి అభినయ్, ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పండుగ రోజున ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాలను పూజించటం, నిమర్జన సమయంలో త్రాగునీరు, సాగుకు ప్రధాన వనరుగా ఉన్న సరస్సులు, నదులలో నీరు కలుషితం కాకుండా నిరోధించబడుతుంది అని అభిప్రాయపడ్డారు.
గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు బట్టలు, దుప్పట్లు, ఆహారం, మందులు విరాళంగా రానున్న రోజుల్లో ఇవ్వనున్నామని, ఇలా ఎందరికో ఆదర్శంగా నిలవడమే గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ లక్ష్యం అని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వ్యాపారవేత్త, ఆర్య వైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్ రావు,
AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వి.ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.








Comments