చిట్వేలి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో.. వైభవంగా ధ్వజ,నవగ్రహ ప్రతిష్ట.
- DORA SWAMY

- Aug 21, 2022
- 1 min read
చిట్వేలి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో..
వైభవంగా ధ్వజ,నవగ్రహ ప్రతిష్ట.

అన్నమయ్య జిల్లా మండల కేంద్రమైన చిట్వేలి బ్రాహ్మణవిధిలో వెలసియున్న శ్రీ భక్త అంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ధ్వజ,నవగ్రహా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు.


గత గురువారంనుంచి ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఆదివారంతోముగిశాయి. కీ. శే.చౌడవరం.రఘురామిరెడ్డి ధర్మపత్ని పద్మవతమ్మ వారి కుమారులు విజయభాస్కరరెడ్డి,ఉమామహేశ్వర రెడ్డి,జగదీశ్వరరెడ్డి,వెంకటసుబ్బారెడ్డి వారి కుటుంబసభ్యులు కార్యక్రమనిర్వాహకులుగా, మధ్యాహ్నం అన్నదాతలుగా వ్యవహరించారు.
చెంజి.మనోహర్ రెడ్డి,కామాటం.శ్రీనివాసులురెడ్డి వారికుటుంబసభ్యులు నవగ్రహాలను ఏర్పాటుచేశారు.వేదపండితులుకోసంగి.అరవింద్ శర్మ,పేరుబోట్ల.గోపాల్ శర్మ,రాయపెద్ది.సతిష్ శర్మలు కార్యక్రమాలను నిర్వహించారు.
ఈకార్యక్రమంలో వైసిపి మండలకన్వీనర్.చెవ్వు.శ్రీనివాసులురెడ్డి,పాటూరు.శ్రీనువాసులురెడ్డి, మలిశెట్టి.వెంకటరమణ,గుండయ్య, శ్రీనివాసులు, కరుణాకర్ రెడ్డి, వెంకట రెడ్డి, నరసింహ,చిన్న, గ్రామపెద్దలు,యువకులు మండల వ్యాప్తంగా భక్తాదులు తధితరులు పాల్గొన్నారు.








Comments