top of page

దివంగత నేతకు ఘనంగా నివాళులు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 8, 2023
  • 1 min read

దివంగత నేతకు ఘనంగా నివాళులు.

--తండ్రి కలలను అమలు చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.

చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి.

ree

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలను చిట్వేలి లో వైసిపి నాయకులు గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిసెట్టి వెంకటరమణ మరియు వైసీపీ పార్టీ శ్రేణులు తో కలిసి శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు.

ree

వైయస్సార్ సర్కిల్ వద్ద విగ్రహానికి గజమాలను వేసి నివాళులు అర్పించారు. కేకును కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. వారు మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు, 108 వాహన సేవ ,ఆరోగ్య శ్రీ,పేదలకు గృహాలు ఇలా పలు పథకాలను అమలు చేసి రైతుల, పేదల గుండెల్లో స్థానం పొందిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. తండ్రి అడుగుజాడల్లోని నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి,సంక్షేమం అను నినాదంతో పలు పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారని అన్నారు. వైయస్సార్ జయంతిని "రైతు దినోత్సవం" గా నిర్వహించడం రైతుల పట్ల మహానేత కు ఉన్న అభిమానానికి గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారెడ్డి, ఆకేపాటి వెంకటరెడ్డి, నవీన్, హజరత్ రెడ్డి, మైనార్టీ నాయకులు అన్సర్ బక్స్, గులాం పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page