top of page

రైతు బాంధవుడు రాజశేఖరడు.. వర్ధంతి వేడుకల్లో.. ఎల్వి మోహన్ రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 2, 2022
  • 1 min read

మహానేత దివంగత రాజశేఖరునికి ఘన నివాళి.

వైసీపీ శ్రేణుల సమక్షంలో ఘనంగా వర్ధంతి వేడుకలు.

ree

రైతు బంధువుడు, పేదల పెన్నిధి గా చిరస్మరణీయుడిగా అందరి హృదయాలలో నిలిచిన దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి వేడుకలను అన్నమయ్య జిల్లా, చిట్వేలి మండలం వైయస్సార్ విగ్రహం వద్ద మండల వైసీపీ సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో... మండల వైసీపీ శ్రేణులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి ఆయన కీర్తిని గుర్తు చేసుకుంటూ జేజేలు పలికారు.

ఈ సందర్భంగా ఎల్.వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నది కొద్ది కాలమే అయినా పేదల పెన్నిధిగా, రైతు బాంధవుడిగా అందరి హృదయాలలో పదిలిమైన స్థానాన్ని పొందిన మహనీయుడు డాక్టర్ వైయస్సార్ అని.. ఆయన కీర్తి ఎల్లప్పటికీ పదిలమని అంతటి మహోన్నత స్థానం కొద్ది మందికే దక్కుతుందని ఆయన స్ఫూర్తితోనే తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం, పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందుతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చంద్ర, ఉప ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీటీసీలు కృష్ణయ్య, గుండయ్య, సర్పంచులు ప్రసాద్, బాలు మరియు వైసీపీ నాయకులు కనకరాజా, మధు, జాకీ, చిన్న, వెంకటసుబ్బయ్య మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page