ప్రొద్దుటూరు నుండి సామాజిక సమతా సంకల్ప సభకు
- PRASANNA ANDHRA

- Jan 19, 2024
- 1 min read
ప్రొద్దుటూరు నుండి సామాజిక సమతా సంకల్ప సభకు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టి, వందల కోట్ల రూపాయల వ్యయంతో 19 ఎకరాల విస్తీర్ణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహా శిల్పం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఆవిష్కరించనున్న నేపథ్యంలో, ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో దాదాపు 400 మంది ఉదయం 6 గంటల ప్రాంతంలో రాజన్న భోజనశాల వద్ద నుండి ఐదు బస్సులలో బయలుదేరి విజయవాడకు చేరుకోనున్నారు. వైసీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు వారి వారి వాహనాలలో సభాస్థలికి చేరనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, సామాజిక న్యాయం, విప్లవానికి నాంది పలికింది తమ వైసీపీ ప్రభుత్వమేనని ఇందులో భాగంగానే నేడు డా. బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్నారని, నియోజకవర్గం నుండి దళిత సంఘాల నాయకులు, దళిత సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి బయలుదేరుతున్నామని ఆయన తెలిపారు.












Comments