top of page

మానవత్వంతో స్పందించి గర్భిణీకి రక్తదానం చేసిన యువకుడు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Sep 24, 2023
  • 1 min read

మానవత్వంతో స్పందించి గర్భిణీకి రక్తదానం చేసిన యువకుడు

రక్తదానం చేస్తున్న సీకే కుమార్

కడప జిల్లా, ప్రొద్దుటూరులోని సాయి శాంత హాస్పిటల్ నందు గర్భిణీ మహిళకు ఆపరేషన్ అవసర నిమిత్తమై "ఏబీ పాజిటివ్" (AB+Ve) రక్తం అవసరం కాగా వారు, పట్టణంలో డొక్కా సీతమ్మ అన్నదాన మరియు రక్తదాన సేవా సంస్థ పర్యవేక్షకుడు గంజి సురేష్ కుమార్ ను సంప్రదించారు. ఈ విషయాన్ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రామాజీ ఇమ్మనుయెల్ కి తెలియచేయగా, కడపజిల్లా యువజన కార్యదర్శి సికే కుమార్ ద్వారా వెంటనే గర్భిణీ మహిళకు "ఏబీ పాజిటివ్" (AB+)గ్రూపు రక్తాన్ని రక్తదానం చేయించారు. అడిగిన వెంటనే స్పందించి రక్తదానం చేసేందుకు వచ్చి రక్తదానం చేసిన సికే కుమార్ కు డొక్కా సీతమ్మ అన్నదాన రక్తదాన సేవా సంస్థ తరుపున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేశారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page