డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- PRASANNA ANDHRA

- May 16, 2023
- 1 min read
డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ


శ్రీ డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. జమ్మలమడుగు నియోజవర్గం, ఎర్రగుంట్ల మండలం, మేకల బాలాయపల్లి గ్రామంలోని శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఆర్టిపిపిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తు, మూడు నెలల కిందట యాక్సిడెంట్లో భర్త చనిపోయి చిన్న రేకుల కొట్టంలో ఇల్లు గడవడానికి కష్టంగా ఉందని తెలిసి, అదే గ్రామానికి చెందిన సుబ్బరాయుడు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి తెలియజేయగా, మంగళవారం ఉదయం దాతలు వెంకటస్వామి, కలమల్ల పోలీస్ సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ కుమార్ బాబు, ఆర్టిపిపి ఫైర్ సిబ్బంది అశోక్ మిత్ర గార్ల సహకారంతో నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ జమ్మలమడుగు ప్రెసిడెంట్ ఆదినారాయణ, సురేంద్ర, సుబ్బరాయుడు, రవి, అశోక్, నందు, అంజి తదితరులు పాల్గొన్నారు.










Great Job