నిరుపేద కుటుంబానికి బట్టల వితరణ
- PRASANNA ANDHRA

- May 8, 2023
- 1 min read


వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గ సిరిగేపల్లి గ్రామంలోని నిరుపేద తల్లి కొడుకుకి, శ్రీ డొక్క సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి ఫైర్ ఆఫీసర్ అశోక్ మిత్ర చేతుల మీదుగా చీరలు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మలమడుగు నియోజవర్గ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఆదినారాయణ మాట్లాడుతూ సిరిగేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబం ఉందని అదే గ్రామానికి చెందిన వెంకట నాయక్ వారి పరిస్థితి అడిగి తెలుసుకుని దాతలు ఏఐటియుసి యూనియన్ నూర్, నూర్ భాషా, కిరణ్ వారి తల్లి లక్ష్మీదేవి పేరు మీద పది చీరలు సహాయంతో గుడిసె పైకి కావలసిన పట్టా, చీరలు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఆదినారాయణ ఫైర్ మెన్ అశోక్ మిత్ర సూరి కిరణ్ గ్రామస్తులు పాల్గొన్నారు.










Great Job