డొక్కా సీతమ్మ 113వ వర్ధంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
- PRASANNA ANDHRA

- Apr 28, 2023
- 1 min read
డొక్కా సీతమ్మ 113వ వర్ధంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ


కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆంధ్రా అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి 113వ వర్ధంతి సందర్భంగా నేడు జమ్మలమడుగు నియోజకవర్గం మేకల బాలయ్య పల్లి గ్రామం శివార్లలో బుగ్గల బట్టి జీవనం సాగిస్తున్న నిరుపేదలైన వారికి దాతలు రవి కుమార్ పది కేజీల బియ్యం, కలమల్ల సాకం అమర్నాథ్ రెడ్డి నిత్యవసర సరుకులు, కూరగాయలు అందించారు.

ఆకలి అన్నవారికి అన్నపూర్ణగా ఆంధ్ర రాష్ట్ర కీర్తిని దశ దిశల వ్యాపించి అన్నదానంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో, ఆమె చేసిన సేవలను కొనసాగించాలనే తలంపుతో ప్రొద్దుటూరు నందు సంస్థ ప్రెసిడెంట్ శ్రీమతి బొలిశెట్టి రెడ్డి ప్రసన్న, వైస్ ప్రెసిడెంట్ నల్లంశెట్టి రామ్ మనోజ్ కుమార్, పలువురు మెంబర్ల ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, రక్తదాన విభాగాన్ని ఏర్పాటు చేసి నేటికీ రెండు సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే డొక్కా సీతమ్మ గారి 113 వ వర్ధంతి సందర్భంగా పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి ఆదినారాయణ తెలిపారు. గతంలో పలువురు రోగులకు, పేదలకు, వృద్ధులకు, అనాధలకు అన్నదానం చేశామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు తమ సంస్థ ద్వారా రాబోవు రోజుల్లో మరిన్ని చేయాలనే తలంపుతో ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.










Comments