top of page

కుక్కల బెడద నుంచి విముక్తి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 16, 2023
  • 1 min read

కుక్కల బెడద నుంచి విముక్తి

కుక్కలను తరలిస్తున్న యానిమల్ కేర్ ల్యాండ్ సిబ్బంది

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


పట్టణంలో పేట్రేగిపోతున్న కుక్కల దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు మున్సిపల్ చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి తిరుపతిలోని యానిమల్ కేర్ ల్యాండ్ వారి ద్వారా కుక్కలను పట్టుకునేందుకు గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. యానిమల్ కేర్ ల్యాండ్ వారి ద్వారా పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకొని వాటిని జనావాసాలకు దూరంగా సురక్షితమైన ప్రాంతాలకు తరలించే విధంగా కార్యాచరణను ప్రారంభించారు.

ree

ఈ సందర్భంగా పోలా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చూసేందుకే తాను ఈ పదవిలో ఉన్నానని., ప్రజల సౌకర్యార్థం ఎటువంటి కార్యాచరణకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.జనార్దన్ రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి రవి, కౌన్సిలర్లు డొంకా సురేష్, ఎస్ ఎం డి న్యామతుల్లా, నవీన్ కుమార్, తంబా సుబ్రహ్మణ్యం, ఖాజా మొహిద్దీన్, తోట లక్ష్మీనారాయణ, రాజేష్, గోవిందు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page