top of page

సచివాలయాన్ని సందర్శించిన డి.ఎల్.డి.ఓ

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 29, 2023
  • 1 min read

సచివాలయాన్ని సందర్శించిన డి.ఎల్.డి.ఓ

సిబ్బందికి సూచనలు చేస్తున్న డి.ఎల్.డి.ఓ నరసింహమూర్తి

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :


బుధవారం డి.ఎల్.డి.ఓ నరసింహ మూర్తి మండల పరిధిలోని ఊటుకూరు సచివాలయాన్ని సందర్శించారు. రికార్డులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల హాజరును పరిశీలించారు. పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న పలు రకాల సర్వేలుపై ఆరా తీశారు. ఈ సందర్బంగా నరసింహ మూర్తి మాట్లాడుతూ ఊటుకూరు సచివాలయంలో రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల పనితీరు అభినందనీయంగా ఉందని ప్రశంసించారు. పంచాయతీ కార్యదర్శి బాల కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. సచివాలయ సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మణికంఠ, డిజిటల్ అసిస్టెంట్ రాణి, ఉద్యాన సహాయకులు పూర్ణచంద్ర, సచివాలయ సహాయకులు వెంకటయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page