ఉద్దేశపూర్వకంగానే మా వెంచర్లపై బురద చల్లుతున్నారు
- PRASANNA ANDHRA

- Oct 6, 2024
- 1 min read
ఉద్దేశపూర్వకంగానే మా వెంచర్లపై బురద చల్లుతున్నారు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఉద్దేశపూర్వకంగానే ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని సాయి శ్రీ నగర్, సాయి కృప నగర్, సాయి కృప ఎంక్లేవ్ లపై కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తూ బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారని, పై లేఔట్ల భాగస్వామ్యులలో ఒకరైన శ్రీనివాసులు ఆదివారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, సదరు వ్యక్తి 2005లో సాయి కృపా నగర్ నందు ఆయన సతీమణి పేరు మీద మూడు ఫ్లాట్లు కొనుగోలు చేసి తిరిగి 2021 వ సంవత్సరంలో అధిక ధరలకు అమ్ముకున్నాడని, కొనుగోలు అమ్మకం జరిపి నేడు సదరు వెంచర్లపై అవాస్తవాలు మాట్లాడటం, అసత్యాలు మాట్లాడడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. గతంలో శివారెడ్డి అనే వ్యక్తికి మహేశ్వర్ రెడ్డి కి ఉన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా నేడు తమ వెంచర్లపై దుష్ప్రచారం మొదలుపెట్టాడని, 2005వ సంవత్సరంలో తమకు పంచాయతీ నుండి అనుమతులు లభించాయని, అయితే నాడు పంచాయతీ అధికారులు లేఔట్లకు పాటించవలసిన నియమ నిబంధనలు తమకు పూర్తిగా తెలుపలేదని, దీన్ని ఆసరాగా చేసుకున్న మహేశ్వర్ రెడ్డి తమపై ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. కొత్తపల్లి పంచాయతీ పరిధిలో కేవలం శివారెడ్డికి చెందిన వెంచర్లు మాత్రమే ఉన్నాయా అంటూ ఈవీ మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు?










Comments