top of page

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన బోగా శరణ్య

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 12, 2024
  • 1 min read

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన బోగా శరణ్య

శరణ్యను అభినందిస్తున్న కాలేజీ యాజమాన్యం
ree
ree
ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 12) విడుదల అయ్యాయి. తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసారు. కాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్ధులు 5,17,617 మంది ఉన్నారు. కాగా ప్రొద్దుటూరు దీప్తి జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యను అభ్యసిస్తున్న బి. శరణ్య 470 మార్కులకు కాను 465 మార్కులు (స్టేట్ సెకండ్), ఏ మహిధర్ రెడ్డి 464 (స్టేట్ థర్డ్), హరిణి 463, హర్షిత 462, ఇమాంబి 461, వెంకట జశ్వంత్ 461, మహమ్మద్ షఫీ 461, ప్రసన్న లహరి 460 మార్కులు సాధించగా, సీనియర్ ఎంపీసీ ఫలితాలలో కె. వినీత 988, సాయి హర్షిని 985, సీనియర్ బైపీసీ ఫలితాలలో సాయి వర్షిత 974, షాహిద్ వల్లి 970 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో తన సత్తా చాటి చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం బాలసుబ్బారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సునీల్ రెడ్డిలు శరణ్య ను అభినందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శరణ్య మాట్లాడుతూ, అకుంఠిత దీక్ష పట్టుదలతో సాధించలేనిది ఏది లేదని, దీప్తి జూనియర్ కాలేజీ యాజమాన్యం, బోధన, బోధనేతర సిబ్బంది ఇక్కడి విద్యార్థినీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధకనపరుస్తూ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, తమను పరీక్షలకు సిద్ధం చేసి తీర్చిదిద్దారని, అందువలనే తాను 465 మార్కులు సాధించగలిగానని చెప్పుకొచ్చారు.

ree

వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు


ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page