top of page

ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. ఏం జరిగింది?

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 20, 2022
  • 1 min read

ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. ఏం జరిగింది?

కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ కారులో మృతదేహం ఉండటం కలకలం రేపింది. అదికూడా ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్న వ్యక్తిదే కావడం.. నిన్న ఎమ్మెల్సీనే సదరు డ్రైవర్​ను బయటకు తీసుకెళ్లడంతో.. ఏం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఏం జరిగిందంటే? : ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ నిన్న ఉదయం.. కారులో తనతోపాటు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ప్రమాదం జరిగిందంటూ డ్రైవర్‌ తమ్ముడికి.. సమాచారం ఇచ్చారు ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌. ఆ తర్వాత తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చిన ఎమ్మెల్సీ.. తెల్లవారుజామున 2 గంటలకు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడగ్గా.. ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారని, సరైన సమాధానం చెప్పాలని అడగ్గా.. మృతదేహాన్ని కారులోనే వదిలేసి, వేరే కారులో వెళ్లిపోయారని మృతును బంధువులు తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...!!

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page