గొనె సంచిలో మృతదేహం లభ్యం
- PRASANNA ANDHRA

- Feb 19, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా, నేండ్రగుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి చెరువులో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఉన్న చెరువులో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో మృతదేహాన్ని మూటగట్టి పడేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ మృతి పట్ల పలు అనుమానాలకు దారి తీస్తోంది.పాకాల ఎస్.ఐ వంశీధర్,సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి,కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.








Comments