top of page

దస్తగిరి కి 24/7 నిరంతరం భద్రత కల్పిస్తున్నాం - పోలీసు శాఖ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 24, 2022
  • 1 min read

దస్తగిరి కి 24/7 నిరంతరం భద్రత కల్పిస్తున్నాం - పోలీసు శాఖ


వై.ఎస్.ఆర్ జిల్లా, పులివెందుల లో డి.ఎస్పి శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయి అయిన షేక్ దస్తగిరి కి సి.బి.ఐ వారు రక్షణ కల్పించమని చేసిన విజ్ఞప్తి మేరకు దస్తగిరి 1+1 సెక్యూరిటీతో పాటు అతని ఇంటి దగ్గర లో 1+3 ఆర్మ్డ్ పికెట్ ఏర్పాటు చేసి 8.12.2021 నుండి కల్పించడం జరిగిందని. దస్తగిరికి, అతని ఇంటికి, అతని కుటుంబ సభ్యులకు కూడా డిసెంబర్ నెల నుండే రక్షణ కల్పించడం జరుగుతోందని. దస్తగిరి సొంత పనులపై బయటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా రక్షణ కల్పించడం జరుగుతోందని. 24/7 నిరంతరం భద్రత కల్పిస్తూ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు అన్నారు.


డిసెంబర్ నెల నుండే ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది తోటి అతని ఇంటి ప్రక్కనే పికెట్ ఏర్పాటు చేస్తూ అతనికి, అతని కుటుంబ సభ్యులకు డిసెంబర్ నుండి రక్షణ కల్పించడం జరుగుతోందని ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు అఐ గురుతు చేశారు. దస్తగిరికి తన రక్షణ విషయంలో ఎటువంటి సమస్యలున్నా జిల్లా అధికారిని కానీ, పులివెందుల డి.ఎస్.పికి కానీ చెప్పవచ్చునని. వాటిని పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. దస్తగిరి ఇంటి వద్ద పాయింట్ బుక్ పెట్టి కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు చెకింగ్ కు వెళ్లి సదరు పాయింట్ బుక్ లో సంతకాలు చేస్తుంటారని. తనిఖీ చేసే పోలీస్ అధికారులు కూడా తనిఖీతో పాటు భద్రత కల్పిస్తున్నారన్నారు.


పోలీసులు ఎటువంటి రక్షణ కల్పించలేదన్నది పూర్తిగా అవాస్తవం అని, సాక్ష్యం గా పోలీసులు ఏర్పాటు చేసిన పికెట్లు, భద్రత ఇందుకు ఉదాహరణగా చెప్పారు, నిరంతరం భద్రత కల్పిస్తున్నాం అని. జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ వెల్లడి చేశారు. దస్తగిరి విషయమై ఈ ఏడాది మార్చి నెలలో జిల్లా కోర్టు కు తెలిపితే కోర్టు పోలీసు శాఖను సమర్ధించి దస్తగిరి పిటిషన్ ను డిస్మిస్ చేసిందని జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. దస్తగిరి కి 24/7 నిరంతరం భద్రత కల్పిస్తున్నామని ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page