చిట్వేలిలో దసరా శోభ
- DORA SWAMY

- Oct 19, 2023
- 1 min read
చిట్వేలిలో దసరా శోభ
--అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు, పూజలు.

శరన్నవరాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం ఐదవ రోజున చిట్వేలి గ్రామ పరిధిలోని పలు ఆలయాల్లో ఆలయ పెద్దలు, అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ మరియు పూజలు నిర్వహించారు.
మోహిని అవతారంలో శ్రీ వాసవి మాత

స్థానిక అమ్మవారి శాలనందు శ్రీ వాసవి మాత మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి తులాభారం నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు తమ మొక్కలు తీర్చుకున్నారు.
రాజేశ్వరి దేవిగా భద్రకాళి అమ్మవారు.

శ్రీవీరభద్ర సమేత శ్రీభద్రకాళి అమ్మవారు శ్రీ రాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు అభయం ఇచ్చారు. కుంకుమార్చన ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు.
ప్రత్యేక అలంకారంలో శ్రీ శ్యామలాంబ అమ్మవారు.

శ్రీ సోమేశ్వర స్వామి సమేత శ్యామలాంబ అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా దసరా శోభ ఉట్టి పడింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.








Comments