top of page

దసరా నవరాత్రుల స్పెషల్ స్టోరీ

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 25, 2022
  • 2 min read

అనకాపల్లి జిల్లా

ప్రసన్న ఆంధ్ర వార్త రిపోర్టర్ వీర


దసరా నవరాత్రుల స్పెషల్ స్టోరీ

ree

అనకాపల్లి, గవరపాలెం, సతకంపట్టు సెంటర్లో గత 30 సంవత్సరాలుగా దశరా నవరాత్రుల రోజుల్లో అక్కడ ఉన్న గౌరమ్మ గుడి భవానీఆశ్రమం ఆధ్వర్యంలో దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి సుమారు వందమంది మాలలు వేసుకొని అతిపవిత్రంగా పూజలు ఉత్సవాలు నిర్వహించేవారు. ఆ ఆశ్రమ నిర్వాహకులలో ముఖ్యులైన పి.వి.రమణ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆలయం నిర్మించాలని 2015 లో సంకల్పం చేయడం జరిగింది.

ree

2015 లో పి.వి.రమణ తన స్వంతనిధులతో ,తన కుటుంభసభ్యుల సహకారంతో అదే సెంటర్లో స్ధలాన్ని కొని తన మిత్రుడు కాండ్రేగుల జగన్నాధరావు దంపతుల ఆర్ధిక సహకారంతో పీలా రమేష్ అనే శిల్పి ఆధ్వర్యంలో అతి చిన్న స్ధలంలో రమణీయమైన దేవాలయాన్ని నిర్మించడమే కాకుండా అత్యంత సుందరమైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని 2016 లో ప్రతిష్ఠింపజేసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది.

అమ్మవారి భక్తుడైన కాండ్రేగుల నాయుడు ,పి.వి.రమణ కి జతకూడి ఈ ఆలయనిర్వహకుడిగా వ్యవహరిస్తూ తను కూడా స్వంత నిధులను ఉపయోగించి ప్రతిరోజు అమ్మవారికి జరిగే దైనందిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆషాడమాసంలో అమ్మవారికి శాఖాంబరి అవతారంలో అలంకరించడం,శ్రావణమాసంలో మంగళగౌరి అవతారంలో అలంకరించడం, ప్రతి పౌర్ణమి కి ప్రత్యేక అలంకరణ చేయడం, మూలానక్షత్రం రోజున హోమాలు నిర్వహించడం, ప్రతి శుక్రవారం పొలమరశెట్టి వెంకట్ ఆధ్వర్యంలో భజనలు నిర్వహించడమే కాకుండా ప్రతి జూన్ లో అమ్మవారి వార్షిక కళ్యాణం అంగరంగవైభోగంగా నిర్వహిస్తున్నారు.


ముఖ్యంగా 2016 నుండి ప్రతి సంవత్సరం దశరా నవరాత్రుల ఉత్సవాలు సంధర్భముగా మాజీ శాసనసభ్యులు పీలాగోవింద సత్యనారాయణ గారి ఆర్ధిక ప్రోత్సాహంతో ప్రతిరోజు సుమారు 3000 మందికి భిక్షలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారి ఉత్సవమూర్తిని పురవీధుల గుండా జానపద కళారూపాలతో రథయాత్ర నిర్వహిస్తారు, ప్రతిరోజు మహిళలతో కుంకుమపూజలు నిర్వహిస్తారు. కర్రి సన్యాశినాయ్డు గారి ఆర్థికప్రోత్సాహంతో ప్రతిరోజు స్ధానిక మళ్ళ జగన్నాధం హాలులో కర్రి రమేష్ మెమోరియల్ నాటిక ప్రదర్శనలు మాజీ కౌన్సిలర్ K.M.నాయ్డు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. శ్రీ విల్లూరి నానాజీ, శ్రీ కర్రిరమణబాబు శాశ్వత ఆర్ధిక ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం పేద విధ్యార్ధులకు,అనాధశరణాలయాలకు,పారిశుధ్య సిబ్బందికి బియ్యం,నూనె,పప్పులు,బట్టలు అందించడం జరుగుతోంది. శ్రీ కాండ్రేగుల నాయ్డ ,శ్రీ మళ్ళ జగప్పారావు ల శాశ్వత ఆర్ధిక ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం 9000 మంది మహిళలకు వాయినాలు అందించడం జరుగుతుంది. దశరా రోజున సాయంత్రం శ్రీ దాడి జయవీర్ బహుకరించిన సుమారు 9 అడుగుల మహా గణపతి సమేత నవ దుర్గల భారీ విగ్రహాలను వివిధ రాష్ట్రాల నుండి రప్పించిన జానపద కళారూపాల నేపథ్యంలో భారీ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ప్రధాన వీధులలో ప్రముఖుల ఆర్ధిక ప్రోత్సాహంతో డూప్స్ డాన్స్,బుర్రకధలు,ఆర్కెష్ట్రా,రేలారేరేలా,సినీ సెట్టింగులు లాంటి భారీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించబడతాయి.ఊరంతా ఏటికొప్పాక వారి భారీ లైటింగ్ కటౌట్లు ,వీధులలో లైటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మందుగుండు సీతారామయ్య గారి బాణాసంచా కూడా ప్రదర్శించబడుతుంది. ముఖ్యంగా వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్ధలు ద్వారా అమ్మవారి ప్రసాదమైన పులిహోర అందజేయబడుతుంది.


ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దశరా నవరాత్రి ఉత్సవాలకు గత 4 సంవత్సరాలుగా శ్రీ దాడి జయవీర్ ఛైర్మన్ గా వ్యవహరించగా ఈ సంవత్సరం ఉత్సవ ఛైర్మన్ గా శ్రీ కర్రి సన్యాశినాయ్డు, డైరెక్టర్లు గా శ్రీ పొలిమేర శివప్పారావు,మళ్ల సూరిబాబు,దొడ్డి రవి,పెంటకోట శ్రీనువాసరావు,శరగడం కాళిదాసు,భీశెట్టి సంతోష్,దాడి అప్పలనాయ్డు,సూరిశెట్టి హృదయ్ లు భాధ్యతలు స్వీకరించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణంలో వ్యవస్ధాపకులు పి.వి.రమణ కి,నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు కి అండగా సూరిశెట్టి నర్శింగరావు, పొలిమేర శ్రీను.కాండ్రేగుల శ్రీను, పెంటకోట గాంధీ,బుద్ధ సంతోష్.యల్లపు వాసు,గండేపల్లి మురళి తదితర మిత్రులు తమ శ్రమదాన సహకారం అందించగా..ఉత్సవ నిర్వహణలో కొణతాల మురళీకృష్ణ.కొణతాల సంతోష్ అప్పారావునాయ్డు, దాడి కృష్ణ, పీ.వి.సత్యనారాయణ,,పెంటకోట జగది,కాండ్రేగుల వాసు,బుద్ధ భూలోకనాయ్డు .k.m.నాయ్డు తదితరులు ఆసరాగా నిలుస్తున్నారు. ముఖ్య ప్రోత్సాహకులుగా శ్రీ కొణతాల బాబూరావు గారు,శ్రీ కొణతాల శ్రీనువాసరావు గారు s% కృష్ణారావు,శ్రీ కొణతాల ప్రసాద్ గారు,శ్రీ కొణతాల చంద్రశేఖర్ గారు,శ్రీ మద్దాల శంకర్రావు గారు వ్యవహరిస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page