డైల్ యువర్ కార్పొరేటర్
- PRASANNA ANDHRA

- Jan 30, 2022
- 1 min read
డైల్ యువర్ కార్పొరేటర్ పేరుతో ఈరోజు సీడబ్ల్యూసీ-1 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారం, 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారం డైల్ యువర్ కార్పొరేటర్ పేరుతో ఈరోజు సీడబ్ల్యూసీ-1 లో కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ప్రధానంగా ఉక్కు నగరంలోని పందులు, కుక్కలు, దోమల సమస్యలతో బాధపడుతున్న ప్రజలు తనకు విజ్ఞప్తి చేశారు. అలాగే డ్రైనేజీ సమస్య పై కూడా అనేకమంది ఆయనకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన కార్పొరేటర్ డాక్టర్ బి గంగారం మాట్లాడుతూ పందుల సమస్యను జీవీఎంసీ వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మిగిలిన సమస్యలపై స్టీల్ యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్తారని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి వైటి దాస్, సి డబ్ల్యూ సి-1 కార్యదర్శి కె బాలశౌరి, సి డబ్ల్యూ సి 1 ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ దామోదర్, జాయింట్ సెక్రెటరీ రాంబాబు పాల్గొన్నారు.









Comments