వివేకానంద జయంతి సందర్భంగా క్రికెట్ కిట్లు పంపిణీ
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా యువతను క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలని అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి, తొట్టంబేడు వైసీపీ నాయకుడు కలవగుంట భరత్ రెడ్డి ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలం పెద్దసింగమల గ్రామంలోని క్రికెట్ జట్టుకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. భరత్ రెడ్డిగారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పంచాయతీ యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతో పాటు నియోజకవర్గానికి వన్నె తేవాలని కోరారు. యువత చదువులోనే కాక క్రీడల్లో కూడా రాణించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.












Comments