పరారీ లో ఉన్న ఇద్దరు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్
- EDITOR

- Nov 21
- 1 min read
పరారీ లో ఉన్న ఇద్దరు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్


వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, ఆన్లైన్ గేమింగ్ కొరకు తమకు బ్యాంకుల యందు అకౌంట్ లు కావాలని తెలిసినవారికి ఆశ చూపి నమ్మించి వారి ద్వారా వివిధ బ్యాంకులలో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయించి, అకౌంట్ లకు ఆన్లైన్ బెట్టింగ్ ఆప్ లేదా వెబ్ సైట్ ద్వారా ఖాతాలలో సొమ్ము జమ చేసుకున్న ముఠాలోని ఆరు మంది సభ్యులను ఈనెల 5వ తేదీన అరెస్టు చేసినట్లు, నేరం అంగీకరించగా ముఠాలో కీలక సభ్యులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన ధనికల వీర శంకరయ్య అలియాస్ వీరశంకర్ అలాగే కాశినాయన మండలానికి చెంది ప్రస్తుతం బెంగళూరు నందు ఉన్న ఆర్ల చంద్రశేఖర్ యాదవ్ లపై ప్రొద్దుటూరు పోలీసులు గట్టి నిఘా ఉంచి శుక్రవారం ఇరువురిని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ యు. సదాశివయ్య అరెస్టు చేయగా, వారి వద్ద నుండి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఖాతాలలో జమ చేయబడిన 10 లక్షల 56 వేల రూపాయల నగదు, మూడు చరవాణీలు, ఒక బ్యాగు స్వాధీనం చేసుకున్నారు.
పై ముఠా సభ్యుల విచారణ చేసినప్పుడు బెంగళూరు నందు పీజీ నడుపుతున్న ధనికల వీర శంకరయ్య మరియు ఆర్ల చంద్ర యాదవ్ ఇరువురు royalbook365.com.in అనే వెబ్సైట్ను సృష్టించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ లావాదేవీల కొరకు బ్యాంకులలో ఖాతాలు అవసరం అయినందున గతంలో అరెస్టు కాబడ్డ తమ అనుచరుల ద్వారా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించుకుని వారికి కమిషన్లు ఇస్తూ వారి ద్వారా విస్తృతంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసినదని, కావున బెట్టింగ్ కు ఉపయోగించిన ఆన్లైన్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తూ బ్యాంకులకు సందేశాలు పంపించామని, అలాగే అనుమానాస్పద లావాదేవీలు ఉన్న అన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేయమని కోరినట్లు ప్రొద్దుటూరు డిఎస్పి పి భావన పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. క్రికెట్ బెట్టింగ్ పై లోతైన విచారణ చేస్తున్నట్లు పై ముఠాలతో సంబంధం ఉన్న అందరిని గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. బెట్టింగ్ ముఠా కార్యకలాపాలను గుర్తించి డ్యూటీలో ప్రతిభను పరిచిన రెండో పట్టణ సీఐ అలాగే స్టేషన్ సిబ్బందిని అభినందిస్తూ తగు రివార్డ్ కోసం సిఫారసు చేస్తున్నట్లు డీఎస్పీ భావన పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.









Comments