ఆర్ ఓ బి వంతెన నిర్మాణం జరుగుతుందా లేదా - రాంబాబు
- PRASANNA ANDHRA

- Feb 9, 2022
- 1 min read
నిడదవోలు ఆర్ ఓ బి వంతెన నిర్మాణం జరుగుతుందా లేదా ప్రజలకు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని సీపీఎం పశ్చిమ గోదావరి డెల్టా జిల్లా కమిటీ సభ్యులు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాంబాబు డిమాండ్ చేశారు, రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని, రైల్వే శాఖ వారి బడ్జెట్ ప్రకారం 50 కోట్ల రూపాయలతో రైల్వే ట్రాక్ పై ఆర్ ఓ బి వంతెనను పూర్తి చేశారు రైల్వే శాఖ వారు ఆర్ ఓ బి వంతెనను పూర్తి చేసారు కాబట్టి రైల్వే గేట్ ను మూసివేసే అవకాశం ఉందని, రైల్వే శాఖ వారు రైల్వే గేటు మూసివేసే పరిస్థితి వస్తే ప్రజల వైద్యపరంగా రవాణా పరంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది తక్షణమే ఆర్అండ్బి అధికారులు ఎమ్మెల్యే రైల్వే ఆర్ ఓ బి వంతెన నిర్మాణం పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.









Comments