సమాన పనికి సమాన వేతనం - సిపిఎం పార్టీ
- PRASANNA ANDHRA

- Jan 30, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, కాంట్రాక్ట్/ ఔట్ స్కోరింగ్ కార్మికులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం, ప్రకారంగా పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, తేది:- 31-01-2022న చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని కార్మికులు ఐక్య పోరాటాలకు ఈరోజు విశాఖ నుండి బయలుదేరుటకు సిద్ధమయ్యారు. నైట్ ప్యాకేజీలు కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు గొల గాని అప్పారావు పాల్గొని మాట్లాడుతూ, కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంటు చేస్తానని మాట పక్కన పెట్టి, ఎల్లా తరబడి వెట్టిచాకిరి, ప్రజా ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పక్కనపెట్టి పని చేస్తున్న వాళ్లు కు, న్యాయం చేయాలని పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కొనియాడారు. గణేష్,నాగరాజు, రాము, వరాలమ్మ పద్మ, అప్పల నరసమ్మ, వెంకటేస్, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.









Comments