top of page

ప్రజలపై పడ్డ భారాన్ని తగ్గించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 30, 2022
  • 2 min read


పెట్రోల్ డీజిల్ గ్యాస్, నూనె, ధరలు తగ్గించాలని,  పెంచిన విద్యుత్తు ఆర్టీసీ, ఆస్తిపన్ను, చెత్త పన్ను, రద్దు చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా



  రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపుమేరకు, అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ  ధర్నాను ఉద్దేశించి, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు  సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ...


ree

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వస్తూనే వంద రోజుల్లో ధరల తగ్గిస్తానని, వందరెట్లు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందని  ఆరోపించారు.  అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా గత రెండు సంవత్సరాల నుండి దేశంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారని బిజెపి ప్రభుత్వానికి ముందు పెట్రోలు 40 రూపాయలు ఉంటే  నేడు 120 రూపాయలు పెంచారన్నారు, డీజిల్ 30 రూపాయల నుండి 110 రూపాయలు,గ్యాస్ నాలుగు వందల నుండి, వెయ్యి రూపాయలు పెంచారన్నారు.


వామపక్షాలు ఆందోళన పిలుపుతో, పెట్రోలు 8, డీజిల్ ఆరు రూపాయలు,  టాక్స్ ,గ్యాస్ 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించినా ఇది కంటితుడుపు మాత్రమే అన్నారు.కేరళ  లో సిపిఎం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 రూపాయలు, తగ్గించింది అన్నారు. కనీస వేతన 600 అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, 40 శాతం విద్యుత్తు ఛార్జీలు పెంచారన్నారు. ఆర్టీసీ చార్జీలు, ఆస్తిపన్ను, చెత్త పన్ను వేసి ప్రజలపై భారం మోపారు. ఉచిత ఇసుక ను ప్రైవేట్ పరం చేసి ఇసుక కుంభకోణానికి పాల్పడ్డారని, ఇసుక ప్రజలకు అందుబాటులో లేదని, సిమెంటు ,కమ్మే , ధరల పెంచారని, జగన్ అన్న ఇల్లులు ఇంకా పూర్తి కాలేదని, పేదవాడు మధ్యతరగతి వారు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు.


ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. గత టీడీపీ కన్నా, వైసీపీ ప్రభుత్వం బాదుడే బాదుడు, భారాలు మోపుతున్నారని  మోటార్లకు మీటర్ల  బిగించి ఉచిత విద్యుత్తు నుండి, రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటున్నారని రాష్ట్రాన్ని అప్పుల్లో  ముంచేస్తున్నారని విమర్శించారు. 


ree

ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ రాజంపేట డివిజన్ నాయకులు,  చిట్వేల్ రవికుమార్, మాట్లాడుతూ, ఒకపక్క ప్రజలకు పనులు లేక, యువతకు ఉపాధి లేక, ఇబ్బంది పడుతూ ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోటీపడి, ధరలు పెంచి, పన్నులు వేసి, ప్రజల పైన భారం పడుతుందని ఆరోపించారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఇంధన ధరలు, నిత్యవసర, పప్పు దినుసులు, నూనె ధరలు తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం  పెంచిన విద్యుత్తు ఆర్టీసీ, ఆస్తి, చెత్త  పన్నులు ఉపసంహరించాలని లేకుంటే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.


ree

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు, నంద్యాల శంకరమ్మ, రైల్వేకోడూరు సిపిఎం నాయకులు లింగాల యానాదయ్య, చిట్వేల్ సిపిఎం నాయకులు, పంది కాళ్ళ మణి,  కెవిపిఎస్  రైల్వే కోడూర్ డివిజన్,  కన్వీనర్, ఓబిలి. పెంచలయ్య, సిపిఎం  ఓబులవారిపల్లి మండల నాయకులు, ఎం  జయరామయ్య , ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి,  పి.జాన్ ప్రసాద్, రాజంపేట నాయకులు, నారాయణ,  మణి మనోజ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఆనందయ్య,  గంపల దేసయ్య, హరి,  రమణయ్య, ఆర్ చంద్రమోహన్ సి ఐ టి యు నాయకులు , నాని,  చిన్న,రమణ,  కోట పెంచలయ్య, ఓబులవారిపల్లి  సి ఐ టి యు మండల కన్వీనర్  దార్ల సుధాకర్, పెనగలూరు సి ఐ టి యు మండల కన్వీనర్,  మద్దెల ప్రసాద్, మహిళా సంఘం నాయకులు  మల్లారపు జయమ్మ ,తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page