top of page

12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి - సిపిఐ

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 26
  • 2 min read

12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి - సిపిఐ

పుట్టపర్తి సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం లో పాల్గొన్న సిపిఐ నాయకులు
పుట్టపర్తి సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం లో పాల్గొన్న సిపిఐ నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని అఖిలభారత జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు నేడు ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సెంటర్లో ఏఐటియుసి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బరాయుడు మాజీ జిల్లా కార్యదర్శి బి రామయ్యలు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకమైనటువంటి 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీరని ద్రోహం చేశారన్నారు. పార్లమెంటులో చట్టాలను చర్చలకు పెట్టి ఆమోదింప చేసుకోవాల్సినటువంటి సాంప్రదాయక పద్ధతికి తిలోదకాలు ఇచ్చి డైరెక్టుగా క్యాబినెట్లో ఆమోదం తెలుపుకొని భారత కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి మోడీ నెట్టివేశారన్నారు.


కార్మికుడి ఎనిమిది గంటల పని విధానం జన్మతః లభించిన హక్కును హరించి 10 నుంచి 12 గంటలు వరకు పెంచుకునే వెసులుబాటును ఆయా యాజమాన్యాలకు కేంద్రంలోని మోడీ కల్పించడం మూలంగా శ్రమదోపిడికి తెరలేపాడన్నారు. ఏదైనా ప్రభుత్వ ప్రవేట్ సంస్థల్లో ఏడు మంది సభ్యులు యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు ఉండేదని నేడు సగానికి పైగా సభ్యులు ఉంటేనే యూనియన్ ఏర్పాటుకు నూతన చట్టం తెచ్చారన్నారు. కార్మికులు తమ సమస్యలు,హక్కులు పరిష్కారం కోసం 14 రోజుల గడువుతో సమ్మెను చేసుకునే హక్కు ఉండేదని దానిని ఈ నూతన చట్టం ద్వారా వంద రోజులకు గడువు పొడిగించడం మూలంగా ఆయాసంస్థల్లోని యాజమాన్యాలు కార్మికులను లోబర్చుకోవడం భయభ్రాంతులకు గురి చేయడం పనుల్లోంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడి కార్మికులను సంఘటితం కాకుండా వారి సమస్యలు పరిష్కారానికి ఉద్యమించే హక్కును సమ్మె చేసే హక్కును హరింపజేసే నల్ల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. కార్మికుడు రిటైర్మెంట్ అవుతూనే సహజంగా తాను దాచుకున్న సొమ్మును గ్రాటిట్యూట్ గా ప్రభుత్వం చెల్లించే సొమ్ములను పదవీ విరమణ పొందిన నాడే చెక్కుల రూపంలో అందించేటువంటి చట్టాన్ని కాలరాస్తూ సంవత్సరం తర్వాత గ్రాటిటీ అందించేందుకు నూతన నల్ల చట్టాన్ని తీసుకురావడంతో కార్మికుడు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లకోమారు లేబర్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ తరపున మరియు యాజమాన్యాలు కార్మికుడు కార్మిక సంఘాలు కూర్చొని ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోని సంస్థల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి అనంతరం చట్టసభల్లో కార్మికులకు అనుగుణంగా చట్టాలు రూపొందించుకునే హక్కులు ఉండేవని కానీ నేడు మోడీ గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం లేదన్నారు. అంతర్జాతీయ లేబర్ సదస్సులో సభ్య దేశాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి అక్కడి తీర్మానాలను అన్ని దేశాలు అమలు చేస్తుంటే కేంద్రంలోని మోడీ సర్కార్ అంతర్జాతీయ లేబర్ అగ్రిమెంట్లను ఖాతరు చేయకుండా కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఆదానిలాంటి కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారన్నారు. కార్పొరేట్లకు అనుగుణమైనటువంటి చట్టాల్లో భాగంగానే రాత్రిపూట పనివేళల్లో మహిళా కార్మికులు ఉద్యోగులు నిర్బంధంగా పనిచేయాల్సిందేనంటూ నూతన నల్ల చట్టాన్ని తీసుకురావడం శ్రామిక మహిళల హక్కులను కాలరాయడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా కేంద్రం కన్నా ముందు బిజెపి పాలిత రాష్ట్రాల కన్నా ముందు గానే రాష్ట్రంలో క్యాబినెట్లో పది నుంచి 12 గంటల పని విధానానికి ఆమోదం తెలపడం కార్మిక ద్రోహం అన్నారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికుల ఉసురు తగిలి కుప్పకూలుతాయని వారు హెచ్చరించారు.


ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షులు చైతన్య సహాయ కార్యదర్శలు దేవర్శెట్టి నరసింహ, మధు మీరావలి, ఉపాధ్యక్షులు యోసోబ్, సమితి సభ్యులు రవికుమార్ శ్యామ్ అరుణ్ సాగర్ జ్యోతి వీరమ్మ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page