సామాజిక న్యాయం ఆత్మగౌరవంకై సిపిఐ నిరసన
- PRASANNA ANDHRA

- Nov 18
- 1 min read
సామాజిక న్యాయం ఆత్మగౌరవంకై సిపిఐ నిరసన

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
భారత కమ్యూనిస్టు పార్టీ CPI జాతీయ సమితి పిలుపులో భాగంగా నేడు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వొద్ద గల జ్యోతిరావు ఫూలే విగ్రహం ఎదుట దేశంలో దళిత గిరిజన,బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కాపాడాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య, పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు మాట్లాడుతూ, విభిన్న మతాలు, విభిన్న కులాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి దేశం మనదన్నారు. దేశంలో బిజెపి అధికారం చేపట్టినప్పటి నుంచి బీసీలపై, దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఈ దాడులు RSS భావజాలంతో ఉన్మాదంతో జరుగుతున్న దాడులన్నారు. ఈ దేశంలో నేషనల్ క్రైమ్ సర్వే రిపోర్ట్ ప్రకారం మైనార్టీలపై, గిరిజనులపై, దళితులపై అరవై వేల కేసులు నమోదయ్యాయంటే దేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం ఏమేరకుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మరోవైపు దేశ సంపాదంతా ఒక వర్గానికే దోచిపెడుతున్నారు. ప్రపంచంలో ఆర్థిక వృద్ది రేటులో 4వ స్థానంలో ఉన్నామంటూ కితాబు ఇచ్చుకుంటున్న మోడీ, ఆ వృద్ధి రేటులో ప్రోగైన సంపద రైతులు, కార్మికుల సృష్టించిన సంపద కాదా అని ప్రశ్నించారు? మొత్తం కార్పొరేట్ల కే అప్పజెబితే దేశంలో ఆర్థిక సమానత్వం ఎక్కడా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జనగణకు ఆమోదం తెలిపింది ఐతే జనగణనతో పాటు కులగణన జరపాలన్నారు. కులగణనలో కేవలం ఏ ఏ కులాలు సంఖ్య కాదు కావాల్సింది. ఆయా కులాల వారికి భూమి ఎంతుంది. విద్యా ఉపాధి ఉద్యోగాల కల్పన ఏమేరకు అందాయి,. రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత వంటి వన్ని సర్వేలు జరిపి వారికి తగిన సమ వాటాలు అందివ్వాలి ఆలా కానీ పక్షాన సిపిఐ దగా పడుతున్న అన్ని వర్గాల వారిని ఏకం చేసి ఉద్యమాల ఉధృతి పెంచుతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సమితి సభ్యులు రామకృష్ణ శ్రీనివాసులు రెడ్డి, నరసింహ జింక గురుస్వామి, హరి, శ్రీను, మీరావలి, మద్దిలేటి, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి పీటర్ తదితరులు పాల్గొన్నారు.








good