వ్విరూపాక్ష పై పోలీసుల దాడి అమానుషం - ప్రొద్దుటూరు సిపిఐ
- PRASANNA ANDHRA

- Mar 14, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో సిపిఐ ఆధ్వర్యంలో నేడు MRO కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆస్పరి మండల సిపిఐ కార్యదర్శి విరూపాక్ష ప్రజా సమస్యలపై ఆస్పరి పోలీసు స్టేషన్ కు వెళ్లగా కానిస్టేబుల్ రామకృష్ణ దురుసుగా ప్రవర్తించటమే కాకుండా SI ముని ప్రతాప్ కానిస్టేబుల్ రామకృష్ణ ఆర్ధ్రరాత్రి విరూపాక్ష ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారని, దాడి చేయటమే కాకుండా అమానుషంగా విరూపాక్ష బట్టలు ఊడదీసి వీధిలో తిప్పి స్టేషన్ కు తీసుకొని వెళ్ళటం దుర్మార్గమయిన చర్య అని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తక్షణమే చట్టబద్ధమయిన తగు చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా MRO ని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో Cpi పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు అధ్వర్యంలో జరిగిన ధర్నా లో పట్టణ ఇంచార్జీ బి.రామయ్య, పట్టణ సహాయ కార్యదర్శి దేవరశట్టి నరసింహ, సమితి సభ్యులు ప్రమీల, శివారెడ్డి, హరి, శ్రీను, షరీఫ్, యోసొబ్, సుధాకర్, రెహమాన్, సుజాత, గోవింద్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.









Comments