top of page

20 వేల ఓట్లు చీలుస్తాం - కౌన్సిలర్ గౌస్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 10, 2023
  • 1 min read

20 వేల ఓట్లు చీలుస్తాం - కౌన్సిలర్ గౌస్

సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్ గౌస్
ree

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో రాజకీయంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న పలువురు వైసిపి నాయకులు, అలాగే ఆ పార్టీ 22వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ మంగళగిరి నందు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోగా, ఇది కాస్త నియోజకవర్గంలో పలు రాజకీయ చర్చలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ తన నివాసం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ఇరవై వేల పైచిలుకు ఓట్లను వైసీపీకి దూరం చేసి టిడిపి ఖాతాలో జమ చేస్తామని, అలా కాని నేపథ్యంలో తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని బహిరంగ ప్రకటన చేశారు. రానున్న ఎన్నికలలో ప్రొద్దుటూరు నందు టిడిపిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని జోష్యం చెప్పారు. 2019 మున్సిపల్ ఎన్నికల సమయంలో తాము తమ కుటుంబ సభ్యులు పార్టీ కోసం అహర్నిశలు పని చేసి అభ్యర్థులను ఏకగ్రీవం చేయటంలో కృషి చేశామని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జేబీఉల్లా, మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page