అమృత్ పధకం పై టీడీపీ అసత్య ఆరోపణలు తగవు - పిట్టా బాలాజీ
- PRASANNA ANDHRA

- Apr 7, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయంలో 35వ వార్డు కౌన్సిలర్ పిట్టా బాలాజీ నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్ వ్వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు, అమృత్ పధకం పై అసత్య ఆరోపణలు తగవు అని హితువు పలికారు. 2019 లో నియోజకవర్గ శాసనసభ్యుడు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చొరవతోనే అమృత్ పధకం కొత్త పుంతలు తొక్కిందని, సుమారు పదిహేను బోర్ల లైవ్ లో ఉండగా వాటిలో పన్నెండు నుండి పదమూడు బోర్లతో నిత్యం ప్రజలకు మంచినీటి సరఫరా జరుగుతోందని, రాచమల్లు ముందుచూపు వలనే ఇది సాధ్యమయ్యిందని, మునిసిపాలిటీ పై అపార అనుభవం ఉన్న ముక్తియార్ ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని, టీడీపీ హయాంలో ఏడు కోట్ల తో అమృత్ పధకానికి నిధులు మంజూరు కాగా వైసీపీ హయాంలో ఇప్పటివరకు నలబై రెండు కోట్ల రూపాయల నిధులు తమ ప్రభుత్వం వ్యచ్చించిందని, ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో 74 శాతం పనులు పూర్తి అయ్యాయయని, ఇంకో మూడు నుండి నాలుగు నెలల్లో నూరు శాతం పనులు పూర్తి చేసి పట్టాణ వాసులకు మంచినీటి కొరత లేకుండా చేయటమే తమా ముందున్న కర్తవ్యం అని తెలిపారు.

ఈ సమావేశానికి మునిసిపల్ వైస్ చైర్మన్ ఖాజా, వార్డు కౌన్సిలర్లు పిట్టా బాలాజీ, జిలాన్, సత్యం, ఖలీల్, మునీర్, అనిల్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.








Comments