కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 108వ జయంతి
- EDITOR

- Nov 19
- 1 min read
ఇందిరా గాంధీ 108వ జయంతి… ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
దేశం కోసం త్యాగాన్ని తన జీవిత ధర్మంగా మార్చుకున్న మహానీయురాలు ఇందిరాగాంధీ : ఇర్ఫాన్ బాషా

ప్రొద్దుటూరు: 19-నవంబరు-2025
ప్రొద్దుటూరు 1 టౌన్ సర్కిల్ వద్ద గల భారతరత్న, మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఏమైనా చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ, “దేశం కోసం త్యాగాన్ని తన జీవిత ధర్మంగా మార్చుకున్న మహానీయురాలు ఇందిరమ్మ అని, జాతి అభ్యున్నతి, ప్రజాస్వామ్య రక్షణ, మహిళా సాధికారత, దేశ బలం కోసం ఆమె చేసిన సేవలు అపారమైనవన్నారు. దేశ సమగ్రత కోసం జీవితం అర్పించిన ఈ మహత్తర నాయకురాలి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
ఇందిరాగాంధీ నాయకత్వ లక్షణాలు, హరిత విప్లవం ద్వారా ఆహార భద్రత కల్పించడం, "గరీబ్ హటావో" ద్వారా పేదల అభ్యున్నతి, అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి భారత్ శక్తి చేయటం, ఇలా ఎన్నో చారిత్రక నిర్ణయాలతో ఆమె భారత రాజకీయాల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. “తన వ్యక్తిగత జీవితానికంటే దేశహితాన్ని ప్రముఖంగా చూసిన ఇందిరమ్మ స్ఫూర్తి ప్రతి భారతీయునికి ధైర్యం, నమ్మకం నింపుతుంది” అని ఇర్ఫాన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గోసంగి సుబ్బారెడ్డి, డీసీసీ సెక్రటరీ ఎల్లయ్య, షైక్ ఖాలాందర్, మౌలాలి, గౌస్, ఖాదర్ బాషా, అలాగే పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









Great