కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన రాచమల్లు
- PRASANNA ANDHRA

- Oct 13, 2022
- 1 min read
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం ఉదయం స్థానిక నడింపల్లి వీధిలో ఉన్న ఎస్.బి మెమోరియల్ స్కూల్ నందు, నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, పిల్లలు చదువు పట్ల ఆసక్తి కనబరుస్తూనే కంప్యూటర్ విద్యపై కూడా సమాన ఆసక్తి శ్రద్ధ కనబరచాలని, రాబోవు రోజుల్లో ఉన్నత విద్య ఉద్యోగాల కల్పనలో కంప్యూటర్ ముఖ్యపాత్ర పోషిస్తుందని, కావున విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కంప్యూటర్ విద్యను తప్పక అభ్యసించాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు పాఠశాల యందు కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు.









Comments