ఇక నిఘా నీడలో మైదుకూరు
- EDITOR

- Nov 20
- 1 min read
ఇక నిఘా నీడలో మైదుకూరు
పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిపై పోలీసుల నిఘా
పట్టణవ్యాప్తంగా 40 ప్రాంతాలలో 80 సీసీ కెమెరాలతో పటిష్ట బందోబస్తు


వైయస్సార్ కడప జిల్లా, మైదుకూరు
పోలీసు ఉన్నతాధికారులు రాయలసీమ డిజిపి కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్, మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ల చేతులమీదుగా నేడు పట్టణం నందు కమాండ్ కంట్రోల్ రూమ్ లంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, పట్టణవాసుల భద్రత కోసం 20 లక్షల రూపాయల సొంత నిధులు కేటాయించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం డి ఐ జి కోయ ప్రవీణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టెక్నాలజీ వాడకంలో పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుందని, కిఇన్విజిబుల్ పోలీస్ - విజిబుల్ పోలీసింగ్' అనే డిపార్ట్మెంట్ నినాదంతో పోలీసులు కనిపించకన్నా వారి డ్యూటీ కనిపిస్తే చాలు అనే విధంగా నేడు మైదుకూరు పట్టణం నందు తమ పోలీసులు పహార కాస్తుంటారని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు తన సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమాన్ని దగ్గరుండి దిగ్విజయంగా పూర్తి చేసిన డిఎస్పి రాజేంద్రనాథ్, సిఐ కే. రమణారెడ్డి, ఎస్సై చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బందికి మౌలిక వసతులకు కొన్ని పరిమితులు పరిధులు ఉంటాయని, అలాంటి వాటిని అర్థం చేసుకొని తమకు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ చేయూతనివ్వడం గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మైదుకూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









Comments