పేద, మధ్యతరగతి ప్రజల సంజీవిని సీఎంఆర్ఎఫ్ - రాచమల్లు
- PRASANNA ANDHRA

- Mar 18, 2023
- 1 min read
పేద, మధ్యతరగతి ప్రజల సంజీవిని సీఎంఆర్ఎఫ్ - రాచమల్లు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
పార్టీలకతీతంగా పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవనిగా మారిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఆయన 18 లక్షల 43 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 12 మంది లబ్ధిదారులకు అందజేశారు. గత మూడు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం అటు సీఎంఆర్ఎఫ్ నిధుల కింద, ఇటు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కౌన్సిలర్ పాతకోట వంశీ, వైసీపీ సీనియర్ నాయకుడు కాకర్ల నాగ శేషారెడ్డి. తదితరులు పాల్గొన్నారు.











Comments