సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
- PRASANNA ANDHRA

- Feb 26, 2022
- 1 min read
ఈ నెల 27వ తేదీన మిలాన్ - 2022 సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, నేవీ అధికారులుతో కలసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ను నిర్వహించారు. విమానాశ్రయం, ఐఎన్ఎస్ డేగ, డాక్ యార్డు, సర్క్యూట్ హౌస్లను పరిశీలించి పలు విషయాలపై చర్చించారు. అక్కడ నుండి బయలు దేరి రామకృష్ణ బీచ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాన వేదికను పరిశీలించి నేవీ, పోలీసు అధికారులతో పలు విషయాలు పై చర్చించి కలెక్టర్ తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అతిథి సింగ్, రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, పలువురు నేవీ, పోలీసు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









Comments