top of page

పేదల పాలిట ఆపన్నహస్తం.. సియం రిలీఫ్ ఫండ్ - బాలనాగిరెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 3, 2022
  • 1 min read

పేదల పాలిట ఆపన్నహస్తం.. సియం రిలీఫ్ ఫండ్... వైకాపా జిల్లా అధ్యక్షులు బాలనాగిరెడ్డి

రాష్ట్రంలోని నిరుపేదల పాలిట సియం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తంగా మారిందని అని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బాలనాగిరెడ్డి అన్నారు.

ree

ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా బాలనాగిరెడ్డి పాల్గొన్నారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ, సోంత డబ్బులతో ఆపరేషన్ చేసుకున్న వారు సియం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటే,ఆ డబ్బులను మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందని, నియోజకవర్గ పరిధిలోని యాబై నాలుగు మందికి రాగా, అందులో కోసిగి మండలంకు చెందిన పదకోండు మందికి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు. సియం జగనన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా అమలు పరిచి ప్రజలు మన్ననలు పోందెలా చేయడం జరిగిందన్నారు. ఈసందర్బంగా లబ్దిదారులు సియం జగనన్నకు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి, మురళీ రెడ్డికి కృతఘ్నతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి, దేశాయ్ కృష్ణ, అత్రి గౌడ్, ఎకాంబర రెడ్డి, పిఏ వెంకట్రామిరెడ్డి, వందగల్లు లక్ష్మయ్య, పల్లిపాడు లంకారెడ్డి, ఆలింగప్ప, నాగబుషణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page